MDK: మనోహరాబాద్ మండలం కోనాయపల్లి (పీటీ) గ్రామంలో పశువైద్యాధికారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల మందుల పంపిణీ చేపట్టారు. పశువుల ఆరోగ్యంపై పెంపకందారులు శ్రద్ధ వహించాలని, ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బందితో పాటు స్థానిక గొర్రెల కాపరులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.