W.G: తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారతిప్ప గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రవాణా సౌకర్యం లేక విద్య, వైద్యం కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.