HNK:ఆత్మకూరు మండలంలో భార్యను హతమార్చేందుకు యత్నించిన మంద రవిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అనుమానంతో నిన్న రాత్రి భార్యను, భర్త రవి కత్తితో గొంతు కోయగా.. భార్య తీవ్రంగా గాయపడింది. కేకలు విన్న స్థానికులు ఆమెను MGM ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు CI సంతోష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.