KMR: కేంద్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని సీఐటీయూ, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చిందన్నారు.