NZB: ధర్పల్లి సహకార సంఘం ప్రత్యేక అధికారిగా మురళి నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల అధ్యక్షులు పదవులను రద్దు చేయడంతో వారి స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచుతామని మురళి శుక్రవారం తెలిపారు. రైతులకు సహకార సంఘం సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు.