GDWL: ఈ ఏడాది జిల్లాలో శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన వార్షిక నేర నివేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల నిఘా కారణంగా 255 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. అలంపూర్ లో గవర్నర్ పర్యటన కూడా విజయవంతంగా సాగిందన్నారు.