GWDL: గట్టు మండలం రాయపురంలో గోకురుమయ్య ఉరుసును పురస్కరించుకుని నిర్వహించిన గిరక బండ్ల పోటీలను గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు ప్రారంభించారు. ఎద్దుల బండికి కొబ్బరికాయ కొట్టి పోటీలను ప్రారంభించారు. గ్రామీణ క్రీడలు సంస్కృతికి ప్రతీకలని తెలిపారు. సర్పంచ్ గోవిందమ్మ తిమ్మప్పతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.