MLG: తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం సాయంత్రం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్తో కలిసి పరిశీలించారు. గద్దెల చుట్టూ ప్రహరీ గోడ, రాతి స్తంభాల నిర్మాణాలను చూశారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని, తప్పుడు ప్రచారాలు చేయవద్దని మంత్రి స్పష్టం చేశారు.