WGL: పట్టణ కేంద్రంలోని ఓరుగల్లు కోటను ఇవాళ స్విట్జర్లాండ్ దేశస్థులు సందర్శించారు. కాకతీయుల కళాఖండాలు చూసి “అద్భుతం” అని ముక్తకంఠంతో కొనియాడారు. పర్యాటక శాఖ గైడ్ రవి యాదవ్ కాకతీయ రాజుల చరిత్ర, నల్లరాతి శిల్పాల విశిష్టతను వివరించారు. కోటలోని శిల్ప భంగిమలు, కళాతోరణాలు, స్వయంభు దేవాలయంలోని చిత్రులింగం, శిల్పకళా సంపదను కెమెరాల్లో బంధించి పులకించిపోయారు.