ADB: హైదరాబాద్‌లో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్-2025 పోటీలకు ఆదిలాబాద్‌కు చెందిన కొమ్ము చరణ్ తేజ్ ఎంపికయ్యారు. సబ్ జూనియర్, జూనియర్ జాతీయ స్థాయి వాటర్ పోలో క్రీడల్లో ఆయన ప్రతిభ చాటనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బోరుగడ్డ గోవర్ధన్ రెడ్డి చరణ్ తేజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.