VZM: జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు గుర్ల మండలం తెట్టంగి జడ్పీ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఆరోతరగతి, పదోతరగతి విద్యార్థులతో మమేకమై వారిలో సృజనాత్మకను పరిశీలించారు. పదో తరగతిలో మంచి మార్కులను సాధించాలని హితవు పలికారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఉపాద్యాయులకు దిశా నిర్దేశం చేశారు.