NZB: తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని డెస్క్ జర్నలిస్టులు గొంతెత్తారు. అక్రెడిటేషన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం డెస్క్ జర్నలిస్టులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.