JN: దేవరుప్పుల మండలంలోని పెద్దమడూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు బండారి రాములు తల్లి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి నివాసానికి వెళ్ళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమకు ఎల్లవేళలా అండగా ఉంటానని అధైర్య పడొద్దని భరోసా కల్పించారు.