PDPL: నూతన సంవత్సర వేడుకలలో డిజేలు నిషేధమని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి శుక్రవానం తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో డీజేలు నిషేధమని, ప్రజలు శాంతియుతంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 31, రాత్రి ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళలో గస్తీ పెంచామన్నారు.