JGL: జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ- 2026ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులని, వారి అనుభవం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.