AP: కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేసిన వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమంది జ్యోతి శివశ్రీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై వివిధ PSలో 33 కేసులు నమోదయ్యాయి. కిడ్నీ మార్పిడి పేరుతో మోసం చేశారని శ్రీకాకుళం వాసి ఫిర్యాదు చేశారని DCP మణికంఠ తెలిపారు. రూ.లక్ష ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేస్తామని.. డబ్బు అందిన వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశారన్నారు.