SRCL: ప్రజలు మూఢ నమ్మకాలు విడనాడాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి కోరారు. గంభీరావుపేట మండలం మండలంలోని హీరాలాల్ తండా గ్రామ ప్రజలకు మూఢనమ్మకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మంత్రాలు, తంత్రాలు, బాణమతి అంటూ నమ్మి మోసపోవద్దన్నారు. ప్రస్తుతం వైద్యం ఎంతో మెరుగు పడిందన్నారు. మూఢనమ్మకాల పేరిట ఎవరిని మోసం చేయవద్దన్నారు.