MDCL: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి సాయినగర్ వెస్ట్‌లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. రాజేశ్వరి వృద్ధాశ్రమం సమీపంలో నివసించే అరవింద్(39)పై అతని భార్య తమ్ముడు, మరో వ్యక్తి కలిసి దాడి చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. గాయపడిన అరవింద్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.