KNR: శంకరపట్నం మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులతో కేశవపట్నం ఎస్సై శేఖర్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని, నేర నివారణకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని సూచించారు. రోడ్డు భద్రత కోసం ప్రమాదకర ప్రాంతాల్లో వీధి దీపాలు, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు.