PDPL: ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఐదు నెలల గర్భిణీ అంజలి (21) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 8 నెలల క్రితం వివాహమైన ఆమెను వరకట్నం పేరుతో భర్త, అత్తింటివారు వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వేధింపులు భరించలేక పుట్టింట్లో ఉంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.