HYD: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి నివాళులు అర్పించారు.