VKB: దోమ మండల కేంద్రం నుంచి పరిగి వెళ్లే ప్రధాన రహదారిలో తిమ్మాయపల్లి సమీపంలో ఓ చెట్టు కొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా వేలాడుతోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఆ కొమ్మలు తొలగించి సమస్య పరిష్కరించాలని కోరారు.