E.G: నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని MPDOలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.