BDK: ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసందే. ఈ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని రేపు మణుగూరులో భారీ అభినందన సభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీపై ప్రజలు చూపించిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనం అని పేర్కొన్నారు.