ADB: సరైన మందులను వాడి కుష్టు వ్యాధిని నయం చేయవచ్చునని డాక్టర్ సర్ఫరాజ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో కుష్టువ్యాధిపై వైద్య బృందంతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. చర్మంపై తెల్లని పాలిపోయిన మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.