బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని లక్ష్యంగా చేసుకుని ఉన్న ఏఐ కల్పిత డీప్ ఫేక్ అసభ్యకర వీడియోల URLను తొలగించాలని బాంబే కోర్టు ఆదేశించింది. ఆ వీడియోలు చాలా అసభ్యకరంగా ఉన్నాయని అభిప్రాయపడింది. తనకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో ఉన్నాయని, వాటిని తొలగించాలని కోరుతూ శిల్పా శెట్టి ఇటీవల కోర్టును ఆశ్రయించడంతోనే ఈ విధంగా తీర్పునిచ్చింది.