AP: ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ యాజమాన్యం టెండర్ వేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి టెండర్ వేసినట్లు తెలిపారు. టెండర్ కూడా డాక్టర్ ప్రేమ్ చంద్ షా పేరుతోనే వచ్చినట్లు చెప్పారు. కిమ్స్ అనేది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని అన్నారు.