కోనసీమ: గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం డ్రగ్స్ నివారణ జాతీయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి గంజాయి అక్రమంగా సరఫరా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రవాణాకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు.