KNR: కరీంనగర్లో పెండింగ్ పనుల పరిష్కారానికి శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ రూ.5.65 కోట్లతో 59 అభివృద్ధి పనులు చేపట్టింది. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాల పనులకు టెండర్లు పూర్తైనా, ఎస్సీ–ఎస్టీ రిజర్వ్డ్ పనుల కేటాయింపులో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల ప్రక్రియను త్వరలో ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.