KDP: బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కోడలీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్‌ను సీఐ లింగప్ప ఆధ్వర్యంలో శుక్రవారం అధికారులు పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో, సిగ్నల్ ఏర్పాటు చేసే టీంతో మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు. ఈ పరిశీలనలో ఎస్సై సత్యనారాయణ పాల్గొన్నారు.