WGL: నల్లబెల్లి (M )కేంద్రంలో వివిధ గ్రామాలలో GP కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలలోనే పాలన కొనసాగుతున్నట్లు ఇవాళ బజ్జి తండ గ్రామ సర్పంచ్ జాటోత్ రవి (చిన్న) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత భవనాలు లేకపోవడం వల్ల GP అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి GP భవన నిర్మాణాలకు కృషి చేయాలని కోరారు.