ATP: జిల్లాలోని అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు RBSK ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు DMHO డా. దేవి తెలిపారు. ఇప్పటివరకు 1,257 మందిలో ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి ఉచిత శస్త్ర చికిత్సలు చేయించామని అన్నారు. రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.