పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎంతో పురాతన దేవాలయమైన కాళ్ల మండలం కాళ్ళకూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యులు శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అలాగే దేవస్థానం నూతన వెబ్సైట్ ను ప్రారంభించారు.