SRD: గ్రామంలో పారిశుద్ధ్యం పనులు మెరుగుపడేందుకు ప్రజలు గ్రామ స్వచ్చతకు సహకరించాలని గైరాన్ తాండ సర్పంచ్ వినోద్ రాథోడ్ అన్నారు. శుక్రవారం గైరాన్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని లొంక తండాలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులను సర్పంచ్ పర్యవేక్షించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదన్నారు.