VZM: చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వినతులు అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారాలకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.