MBNR: మహిళా రక్షణ, బాలల సంక్షేమం, రోడ్డు భద్రత, సైబర్ నేరాల నియంత్రణనే లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రజలకు అండగా నిలుస్తారని ఎస్పీ జానకి వెల్లడించారు. పోలీస్ శాఖకు సంబంధించిన 2025 సంవత్సరపు వార్షిక నివేదికను పత్రిక సమావేశం ద్వారా ఆమె విడుదల చేశారు. 2024లో 5,937 కేసులు నమోదు కాగా, 2025లో 11,775 ఫిర్యాదులు స్వీకరించి, తక్షణ చర్యల ద్వారా నేరాల రేటు 5% తగ్గించామన్నారు.