ADB: తలమడుగు మండలం బరంపూర్ నుంచి సకినాపూర్ వరకు రోడ్డు అధ్వానంగా మారిందని, కంకర తేలి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బరంపూర్‌లో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.