VZM: మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్సై నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్‌పై అవగాహన, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.