కృష్ణా: క్రీడాకారులకు ఏ ప్రభుత్వంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఏపీ ఖో ఖో ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మహిళలు పురుషుల విభాగంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సీనియర్ ఖో ఖో పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు విజయం సాధించింది.