NLG: పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సీపీఐ ఉద్యమం చేపట్టనుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి లోడింగ్ శ్రవణ్ కుమార్ అన్నారు. పార్టీ 100 వార్షికోత్సవాల సందర్భంగా ఇవాళ చిట్యాలలో పార్టీ జెండాను సీనియర్ నాయకులు దేశగాని బాలరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్రం పేరు మార్చిందని ఆరోపించారు.