ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన షేక్ అక్బర్ అనే ముస్లిం రైతు అయ్యప్ప స్వాములకు భిక్ష శుక్రవారం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు. ఆయన మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలన్నారు. అయ్యప్ప స్వాములకు బిక్ష ఇవ్వడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు, గ్రామ యువకులు ఉన్నారు.