SKLM: ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో రూ.42 లక్షలతో నిర్మించబోయే పోస్టుమార్టం భవనానికి ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు ఇవాళ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.12.50 లక్షలతో నూతన జనరేటర్‌ను, రూ.18 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన అల్ట్రా సౌండ్ పరికరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.