NZB: నగరంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఓ కిలాడి లేడీ టోకరా వేసింది. ఏకంగా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్అండ్ సీఈ సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు సృష్టించింది. జూనియర్ అసిస్టెంట్ నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసింది. నియమక పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులు మూడో టౌన్ పోలీసులను ఆశ్రయించారు.