KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలోని సభా భవనంలో ఈనెల 27న శనివారం ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదిస్తారని ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.