కోనసీమ: టీడీపీలో కష్టపడే ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శుక్రవారం రామచంద్రపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం నుంచి పార్లమెంటు టీడీపీ కమిటీలో స్థానం పొందిన నాయకులను మంత్రి అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని వారికి సూచించారు.