కృష్ణా: హనుమాన్ జంక్షన్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ 2026 జనవరి 1వ తేదీ కల్లా వెలిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక పనులు శనివారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. పట్టణంలో రాత్రివేళల భద్రత మెరుగుపడటంతో పాటు ట్రాఫిక్ సౌలభ్యం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో హనుమాన్ జంక్షన్‌కు మరింత శోభ చేకూరనుంది.