ప్రకాశం: సీపీఐ శత జయంతి వేడుకలను మార్కాపురం సీపీఐ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే.కాసిం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. దేశ అభ్యున్నతిలో సీపీఐ పాత్ర కీలకమని, అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.