MBNR: మూసాపేట మండలం వేముల గ్రామంలో అత్యాచారానికి గురైన ప్రవళిక నిందితులను ఎన్కౌంటర్ చేయాలని గండీడ్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లి చౌరస్తాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాలకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.