కృష్ణా: విజయవాడలో నిర్వహించిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.