ADB: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలని గ్రామ యువకులు శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.